యితడు భువనములకు ఈశ్వరుండై

మీ లలిత గేయ రచనలు, మీ అభిమాన (రచయిత) లలిత గేయ రచనలు, వాటి పై మీ వ్యాఖ్యానాలు, చర్చలు

యితడు భువనములకు ఈశ్వరుండై

Postby RamaChakala » Fri Nov 04, 2016 10:08 pm

పల్లవి. యితడు భువనములకు ఈశ్వరుండై,
సతత సంపన్న, సౌఖ్యప్రద సృష్టి గావించె. ||యితడు||

అనుపల్లవి. సర్వ జీవులపై సమతుల్య భావనతో,
ఉర్విపై ప్రాణులకు ఊపిరి పోసే. ||యితడు||

1. జీవము నిచ్చి, అనురాగము నింపి,
భవితవ్య మందించ భాగ్యముల నొసగే,
అవిరళ సృష్టిగల అంతరంగం బిచ్చి,
నవతతో జీవించ ఆదేశ మొసగే. ||యితడు||

2. ఆకలికి అన్నము అందరికి యొసగి,
సకల సృష్టిని తానే పోషణ చేసే,
చక్కని గాలి సమృద్ధిగ నిచ్చి,
వెక్కసపు సంపదలు విరివిగా కూర్చే. ||యితడు||

3. పంచ భూత కలిత పార్ధివ దేహముకు,
మించిన మానసిక శక్తులు గూర్చే,
అంచలంచలుగ అభివృద్ధి చెందను,
వంచి కృషి చేయు మార్గములు తెలిపే. ||యితడు||

4. చిన్న. పెద్ద యన్న తేడాలు చూపక,
ఉన్నత భావనలు జీవులకు నిచ్చే,
ఎన్నెన్నో యిచ్చిన వేంకట రమణుని,
వినతి చేయు కవి హృదయము గూర్చే. ||యితడు||

రచన: చాకలకొండ రమాకాంతరావు శుక్రవారం 04 నవంబరు 2016
Visit:‫ ‪http://ramakantha.com /‬ & ‪http://lordbalajisongs.com/‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬
RamaChakala
 
Posts: 80
Joined: Fri May 11, 2012 6:45 pm

Return to లలిత గేయ సాహిత్యం

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron