జాలి జూపని గుండె, మేలు చేయని గుండె

మీ లలిత గేయ రచనలు, మీ అభిమాన (రచయిత) లలిత గేయ రచనలు, వాటి పై మీ వ్యాఖ్యానాలు, చర్చలు

జాలి జూపని గుండె, మేలు చేయని గుండె

Postby RamaChakala » Sat Nov 23, 2013 12:54 pm

పల్లవి. జాలి జూపని గుండె, మేలు చేయని గుండె,
చలనము యున్న శిలకు సమానమే. || జాలి ||

అనుపల్లవి. పాప చింతన లేని పాషాణి గుండె ,
ఊపిరి పీల్చెడి రాయి సమనమే. ||జాలి ||

1. తల్లి, దండ్రుల పైన దయలేని గుండె,
ఇల్లాలు పైన ఇంపు జూపని గుండె,
పిల్ల, జెల్ల పైన ప్రేమ లేని గుండె,
పలలము పెరిగిన పాషాణ సమమే. ||జాలి || పలలము = మాంసము
2. గురువు పై గౌరవము జూపని గుండె,
పొరుగు వారికై యింత పని చేయని గుండె,
ఆర్తికి అన్నము పెట్టనిగుండె,
బరువుగ పెరిగిన శిలకు సమానమే. ||జాలి ||

3. తోబుట్టుల బ్రతుకు తీర్చని గుండె,
అభయ మిచ్చి జనుల బ్రోవని గుండె,
శుభకరుడు శ్రీశుని స్తుతి చేయని గుండె,
నభము క్రింద దొర్లు నిమ్న పాషాణమే. ||జాలి ||

రమాకాంతరావు చాకలకొండ ఆదివారం, 17 నవంబర్ 2013

Visit: http://ramakantha.com / http://lordbalajisongs.com/
RamaChakala
 
Posts: 80
Joined: Fri May 11, 2012 6:45 pm

Return to లలిత గేయ సాహిత్యం

Who is online

Users browsing this forum: No registered users and 2 guests

cron