మన సదస్సుకు తోడుగా నిలిచిన ప్రసాదు గారిక మనకు తోడు లేరు!

చమత్కార సాహిత్యం - చలోక్తులు, హాస్యోక్తులు (జోక్సు), కార్టూన్లు .. తెలుగులో మాత్రమే సుమా!

మన సదస్సుకు తోడుగా నిలిచిన ప్రసాదు గారిక మనకు తోడు లేరు!

Postby bkraghuvarma » Wed Aug 21, 2013 10:30 pm

అనంతమయిన తెలుగు భాషాభిమానం తో మన తెలుగు సదస్సు కు జీవం పోసి మనకు తోడుగా నిలిచిన వారణాసి ప్రసాదు గారిక మనకు తోడు లేరు!

మధురమయిన కవితాగానం తో మనలను ముగ్ధులను చేసి మైమరపించిన వారణసివారిక మరలి రారు!

నాయనా! అని చిన్న వారిని ప్రేమపూర్వకంగా పలుకరించి ఉత్తేజపరచిన వారణాసి తేజమిక మనకు కాన రాదు!

ఆఖరి సారిగా మన సదస్సులో పాల్గొని మనం చేసిన చిన్ని సత్కారానికి ఎంతో మురిసి నాడు మనసుదీరా మనలనాశీర్వదించి నేడు పరమపదించిన ప్రసాదు గారి పదమిక మనకు విన రాదు!
వారణాసి వారి మన ఆఖరి జ్ఞాపకాలు

http://telusuna.org/meetings/05-22-2010/index.html

రఘువర్మ బసవరాజు


---------- Forwarded message ----------
From: LaikaRealty Adams <laikarealty@gmail.com>
Date: Wed, Aug 21, 2013 at 11:25 AM
Subject: Prasad
To: Raghuvarma Basavaraju <bkraghuvarma@gmail.com>


Aloha Raghuvarma,
Prasad, passed away on the 19th of August at 12.33 pm, his cremation is tomorrow.
I did not realize, what a great soul he was, until I got this email from the university yesterday.Such a humble soul. God Bless him and may his soul rest in peace. My # here is 808 312 4008"Prasad Varanasi came to Stony Brook in 1967 when he joined our atmospheric sciences group in the Department of Mechanical Engineering. Before coming to Stony Brook, he was already known for discovery of the continuum structure in the infrared spectrum of water vapor as a Ph.D. student at the University of California, San Diego, a major contribution in molecular spectroscopy.

At Stony Brook, Professor Varanasi built one of the world's finest infrared spectroscopy labs with advanced Fourier transform spectrometers, a tunable diode laser spectrometer, and several cryogenically coolable absorption cells of his own design. He and his students were the first to measure spectra of methane, carbon dioxide and other gases at temperatures that prevail in planetary atmospheres. Dr. Varanasi was also among the first to measure infrared spectra of several Freon gases, which were later recognized to be a major component of global warming.

Professor Varanasi was the Chief Editor of the Journal of Quantitative Spectroscopy and Radiation Transfer, a world-class journal in his field, from 1990 to 2005. He was a major contributor to the world standard HITRAN database (High-resolution Transmission molecular absorption database), a long-running project started by the Air Force Cambridge Research Laboratories (AFCRL) in the late 1960's in response to the need for detailed knowledge of the infrared properties of the atmosphere and continuously developed at the Harvard-Smithsonian Center for Astrophysics."
రఘువర్మ బసవరాజు
bkraghuvarma
 
Posts: 56
Joined: Mon May 07, 2012 8:17 pm

Re: మన సదస్సుకు తోడుగా నిలిచిన ప్రసాదు గారిక మనకు తోడు లేరు!

Postby subu » Thu Aug 22, 2013 8:47 pm

The Last Poem of Guruvu gaaru's in my mail box.
Lived a complete life. JAI GURUVU GAARU ( VAARANASI PRASAD GARU )
A real Telugu Man

తెలుగువానిగా మెలిగెడి నేను,
తెలుగువాణినే పలికెడి నేను,
తెలుపగలేనీ వెలుగువికాస౦
తెలియగలేనీ దివ్యప్రసాద౦ ||

దేశాలెన్నో తిరిగిన నాకు
ఆశావాదగు ఆ౦ధ్రుడ నాకు
దేశావేశ౦ "తెలుగ"ను భావ౦
దేశాదేశ౦ తెలుగానుభవ౦ ||

Aloha,
Durgaprasad Varanasi
February 9, 2013
subu
 
Posts: 117
Joined: Thu May 10, 2012 9:03 pm

Re: మన సదస్సుకు తోడుగా నిలిచిన ప్రసాదు గారిక మనకు తోడు లేరు!

Postby sriniguduru » Sat Aug 24, 2013 11:20 am

వారణాసి గారి అకాల మరణ వార్త విని దిగ్బ్రాంతి చెందాను. మన సదస్సుకి పుంఖాను పుంఖాలుగా కవితలు, పద్యాలు ఆశువు గా పంపించి, వినిపించి మాత్రు దేశానికి ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న మన తెలుగు పిపాసని తమ కవితా గానంతో దాహార్తిని తీర్చారు. సైంటిస్ట్ గా మన దేశ ఖ్యాతిని ఇనుముడింప జెసారు. నిగర్వి, మంచి మనసున్న వారణాసి గారిని మరవలేము. వారి ఆత్మ శాంతికై ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
sriniguduru
 
Posts: 2
Joined: Thu May 10, 2012 10:24 pm


Return to చమత్కార సాహిత్యం - చలోక్తులు, హాస్యోక్తులు (జోక్సు)

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron