tyaagayya sangeetam

67 వ తెలుసునా సదస్సు ""సాహిత్య సంగీత చక్రవర్తి త్యాగయ్య మధుర సాహిత్యం".

Re: tyaagayya sangeetam

Postby ravi » Tue Jul 17, 2012 11:41 pm

సుబ్బు గారు,

నేనేవన్నా అధిక ప్రసంగం గా మాట్లాడుంటే క్షంతవ్యుడను. మీతో ఎప్పుడో ఒక సారి ఒక రెండు ఈమైలు పరచయం మనది. కానీ ఆ పరిచయం లోనే మీరు చెప్పేరు, మీరు ఆంగ్లం చదువుకున్నారని, తెలుగు మీకంత తెలియదని. కానీ సుబ్బు గారు, పరిచయం ఉంది కదా అని ఒకటి రెండు తేలిక మాటలు మాట్లాడేనేవో. ఖచ్చితంగా నాదే తప్పండీ. కనీసం మీకు వ్రాసే ధైర్యం వుంది, వ్రాయాలనే కోరిక వుంది, అది నేను చెప్పలేకపొయ్యాను. సుబ్బు గారు మీ లాగే నేను కూడా తెలుగుని సెకండ్ లేన్గ్వేజ్ గా పన్నెండో తరగతి వర్కే చదువుకున్నానండీ. ఆ చదువు కూడా తెలుగు క్లాస్ ఎగ్గొట్టి లీలా మహల్లో ఇంగ్లీష్ సినిమా చూసిన చదువు నాది.

సుబ్బు గారు, మీకు వ్రాయాలనే కోరిక ఉంది, వ్రాయగలిగే శక్తి ఉంది, మీరేవీ పట్టించుకోకండి, నాలాటి వాడెవడో తెలిసీ తెలియకుండా మాట్లాడిన మాటలు. మీరు వ్రాయండి. మీరు ఎలా వ్రాశారు అనే దానికన్నా, ఆ వ్రాయాలనే కోరిక చాలా ముఖ్యం సుబ్బుగారు. నా వాచాలతని దయచేసి మన్నించండి.
-రవి
ravi
 
Posts: 18
Joined: Tue Jul 03, 2012 12:24 pm

Re: tyaagayya sangeetam

Postby subu » Mon Jul 23, 2012 8:35 pm

మనుషుల్లోనే పరమాత్మ , నా రాముడున్నాడు అని, నా రాతలలో నేను చెప్పు మాట నిజమని అని నాకు తెలిసింది
subu
 
Posts: 117
Joined: Thu May 10, 2012 9:03 pm

Re: tyaagayya sangeetam

Postby ravi » Wed Jul 25, 2012 11:10 am

సుబ్బు గారు,
నాకు అర్థం కాలేదు మీరేవి వ్రాశారో, లేకపోతే ఏవి వ్రాయాలనికుని ఏవి వ్రాశారో. మీ వ్రాతల వలన మీకు నిజం తెలిస్తే, అసలు వ్రాయాల్సిన అవసరవే లేదు. ఎందుకంటే మీరేవి వ్రాస్తారో, మీరు వ్రాయకపోయిన అది మీకు తెలుసు. మనం వ్రాసేది మనకు తెలియని విషయాల్ని తెలుసుకోవటం కోసం అని నేను అనుకుంటున్నాను. ఏదేవైన ఇక ఈ చర్చ కి ఇక నేను జవాబియ్యదలచుకోలేదు. మీరు అనంతవైన రామ భక్తులు, ఇక్కడ విశ్వాసం తప్పితే లాజిక్ లేదు, రేషనల్ లేదు. చర్చ విశ్వాసాలతో పెరగదు, లాజిక్ తో, తర్కం తో పెరుగుతుంది.

-రవి
ravi
 
Posts: 18
Joined: Tue Jul 03, 2012 12:24 pm

Re: tyaagayya sangeetam

Postby subu » Wed Aug 01, 2012 8:05 pm

రవి గారు ,

Correct Sir. మీరు చెప్పింది/రాసింది అక్షరాలా నిజము.

Subu
subu
 
Posts: 117
Joined: Thu May 10, 2012 9:03 pm

Previous

Return to 67 వ తెలుసునా సదస్సు ""సాహిత్య సంగీత చక్రవర్తి త్యాగయ్య మధుర సాహిత్యం"

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron