స్త్రీ మూర్తి
భూభారమ్ము నోర్చు భూదేవికైన,
ఓర్పుగ ఓర్పు నేర్పు సహనమూర్తి!
సుకుమారమ్ములైనొప్పుకుసుమాలకైన,
అందమరువిచ్చు సౌందర్యమూర్తి!
సొగసులొలుకు కవితా కన్నియల
సోయగమ్ములకిచ్చు, సుందర స్ఫూర్తి!
మనుజజాతికి జన్మనిచ్చు జగజ్జనని,
మమతలందించు మాతృమూర్తి!
స్వచ్ఛమైన ప్రేమ ఏమిటొ ప్రేమకైన,
ప్రేమతొదెల్పు ప్రేమమూర్తి, సమవర్తి!
రచన : రఘువర్మ బసవరాజు