ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా "స్త్రీ మూర్తి" కవిత

తెలుగు కవితా సాహిత్యం, మీ స్వీయ కవితలు లేదా మీ అభిమాన కవి కవితలు, వాటి పై మీ వ్యాఖ్యానాలు, చర్చలు

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా "స్త్రీ మూర్తి" కవిత

Postby bkraghuvarma » Tue Mar 08, 2016 4:32 pm

స్త్రీ మూర్తి

భూభారమ్ము నోర్చు భూదేవికైన,
ఓర్పుగ ఓర్పు నేర్పు సహనమూర్తి!

సుకుమారమ్ములైనొప్పుకుసుమాలకైన,
అందమరువిచ్చు సౌందర్యమూర్తి!

సొగసులొలుకు కవితా కన్నియల
సోయగమ్ములకిచ్చు, సుందర స్ఫూర్తి!

మనుజజాతికి జన్మనిచ్చు జగజ్జనని,
మమతలందించు మాతృమూర్తి!

స్వచ్ఛమైన ప్రేమ ఏమిటొ ప్రేమకైన,
ప్రేమతొదెల్పు ప్రేమమూర్తి, సమవర్తి!


రచన : రఘువర్మ బసవరాజు
రఘువర్మ బసవరాజు
bkraghuvarma
 
Posts: 56
Joined: Mon May 07, 2012 8:17 pmReturn to కవితా సాహిత్యం

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron