"శ్రీమద్రామాయణకావ్యం" ప్రత్యేక సదస్సు వివరాలు - తొలి సూచన

73 వ తెలుసునా సదస్సు "శ్రీమద్రామాయణం"

"శ్రీమద్రామాయణకావ్యం" ప్రత్యేక సదస్సు వివరాలు - తొలి సూచన

Postby bkraghuvarma » Fri Apr 19, 2013 10:40 pm

నమస్తే,

మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!

"యావత్ స్థాస్యన్తి గిరయ: సరితశ్చ మహీతలే |
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి ||"
(ఈ భూమి పై నదులు. కొండలూ నిలచి ఉన్నంతవరకూ - అంటే ప్రాణి కోటి ఉన్నంతవరకూ, రామాయణ కథ జీవించి ఉంటుంది!)

భారతీయులను, భారతీయ సంస్కృతిని "ఆదికవి" వాల్మీకి అపూర్వ సృష్టి, "ఆది కావ్యం" అయినట్టి "శ్రీమద్రామాయణకావ్యం" ప్రభావితం చేసినట్లుగా మరే ఇతర కావ్యం చేయలేదనడం అతిశయోక్తి కాదేమో.

ఏప్రిల్ 28 వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 2 నుండి 5 గం|| వరకు ఓరుగంటి వారి (ధనలక్శ్మి, ప్రభు దంపతుల) స్వగృహం లో (76-16, 175త్ స్ట్రీట్, ఫ్రెష్ మెడోస్, న్యూ యార్కు,-11366, ఫోను 718 591 1054) జరుగనున్న మన 73 వ తెలుసునా సదస్సు ప్రత్యేక విషయం "శ్రీమద్రామాయణం" అని తెలియజేయడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పట్లాగే ఆసక్తికరమయిన సామూహిక చర్చలు, వినోద కార్యక్రమాలతో మిత్రులందరినీ రంజింపజేయబోయే ఈ సదస్సు లో మీరు కూడా ఏదయినా కార్యక్రమం సమర్పించదలచుకొంటే 22 వ తేదీ లోగా నాకు తెలియ జేయండి.

మనం తొలిసారిగా "శ్రీమద్రామయణం" ప్రత్యేక విషయం గా పండుగ లా జరుపుకొంటున్న ఈ వినోదభరిత వినూత్న సదస్సులో మిత్రులందరూ ఉత్సాహంగా పాల్గొని ఆనందం పంచుకొంటారని ఆశిస్తూ,

మిత్రుడు
రఘువర్మ బసవరాజు
రఘువర్మ బసవరాజు
bkraghuvarma
 
Posts: 56
Joined: Mon May 07, 2012 8:17 pm

Return to 73 వ తెలుసునా సదస్సు "శ్రీమద్రామాయణం"

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron