భాగవతము

అన్ని రకాల చందోబద్దమయిన పద్యాలు, పద్య కావ్యాల - పద్య సాహిత్యం, పద్య రచనల వ్యాఖ్యానాలు, చర్చలు.

భాగవతము

Postby Dr.Rapelli_Sridhar » Wed Sep 17, 2014 9:32 pm

“భా”యన భక్తిగా భావమందరసియు
గురుదేవుజేరియు గొలచి తలచి
“గ”యనగా జ్ఞానంబు కాయంబునందున
విడకనున్న తెలివి విధము తెలిసి
“వ”యనగా వైరాగ్య వైవిధ్యమును పూని
సంసారమందలి సారమొంది
“త”యనగా తత్త్వంబు తనరూపునెఱిగియు
తనకు మూలములేని తత్త్వమరయ

“ము”యన ముక్తిగా వ్యాసుండు మోదముగను
భాగవతమున జెప్పెను భవ్యమైన
నల్లనయ్యగారి కథను నయముగాను
వీనులకు విందదియు జూడ వినగనొప్పు!!
Dr.Rapelli_Sridhar
 
Posts: 129
Joined: Thu May 10, 2012 1:38 pm

Return to పద్య సాహిత్యం

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron