స్వార్థము వద్దని చక్కగా బోధనల్

అన్ని రకాల చందోబద్దమయిన పద్యాలు, పద్య కావ్యాల - పద్య సాహిత్యం, పద్య రచనల వ్యాఖ్యానాలు, చర్చలు.

స్వార్థము వద్దని చక్కగా బోధనల్

Postby Dr.Rapelli_Sridhar » Sun Jun 26, 2016 10:39 pm

స్వార్థము వద్దని చక్కగా బోధనల్
జేయుచు స్వార్థపు చింత విడరు!
నీతుల సూత్రాలు నిరతంబు కథలుగాన్
జెప్పుచు అవినీతి చేష్ట విడరు!
కోపంబు వద్దని కులుకుచు పాటలన్
పాడుచు రౌద్రమౌ పాట్లు విడరు!
ఈర్ష్యాదులొద్దని ఇంపుగా శృతులనున్
వల్లించి హృదిలోని వ్యాధి విడరు!

పూర్ణబోధను గోరియు పూర్ణగురుని
సేవజేసియు సారమున్ శిష్యవరుడు
పొంది నడకందు నిస్స్వార్థ పూరితముగ
నాచరించిన జన్మంబు అమలమగును!
Dr.Rapelli_Sridhar
 
Posts: 129
Joined: Thu May 10, 2012 1:38 pm

Return to పద్య సాహిత్యం

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron