చలం: ముఖాముఖీ

మీ స్వీయ కథా రచన లేదా మీ అభిమాన (రచయిత) కథా రచనలు, వాటి పై మీ వ్యాఖ్యానాలు, చర్చలు.

చలం: ముఖాముఖీ

Postby arajam » Sun Sep 16, 2012 7:39 am

-అరుణ్
arajam
 
Posts: 14
Joined: Wed Aug 15, 2012 10:21 pm
Location: Kew Gardens

Re: చలం: ముఖాముఖీ

Postby Anuradha Bandlamudi » Sun Sep 16, 2012 11:57 am

నమస్కారం అరుణ్ గారు,

చాల సంతోషం, మీరు చలం గారి ముఖా ముఖి మాకు అందించారు. ముఖా ముఖి గురించి మీ అభిప్రాయం కూడా వ్రాస్తే బాగుంటుంది కదా!

అనూరాధ బండ్లమూడి.
Anuradha Bandlamudi
 
Posts: 11
Joined: Tue May 15, 2012 7:33 pm

Re: చలం: ముఖాముఖీ

Postby arajam » Sun Sep 16, 2012 7:10 pm

నమస్తే అనురాధ గారు.

చలం రచనలకి నేను వీరాభిమానిని ఎప్పటికీ. తన రచనలపై ఆయన చివరిగా చెప్పిన అభిప్రాయలు, వాటికి కారణమైన, కారణం అనుకున్న విషయాలు కూడా అర్ధం చేసుకోగలను. ఆయన జీవన విధానాన్ని ప్రశ్నించే అర్హత తనపై ఉన్న నా అభిమానికి లేదని తెలుసు. ఆయన మజిలి రమణ మహర్షి కాకుండా ఉంటే బావున్ను అని మాత్రం చిన్న అసంతృప్తి. ఇది నాలో నాస్తికుడికి అభిమానికి జరిగే ఓటమి లేని యుద్ధం. "నువ్వు కాదా వేశ్య?" అని పిడికిలి బిగించిన కలం, చివరి దశలో బూడిద (విభూది కాబోలు!) కరిచిందేంటి.... ఇలా కాకుంటే బావుండేది నాలోని నాస్తికుడికి. అంతే!
-అరుణ్
-అరుణ్
arajam
 
Posts: 14
Joined: Wed Aug 15, 2012 10:21 pm
Location: Kew Gardens

Re: చలం: ముఖాముఖీ

Postby Anuradha Bandlamudi » Mon Sep 17, 2012 6:57 pm

నమస్కారం,

చివరికి మిగిలేది పిడికెడు బూడిదే కదా!
విషయానికి వస్తే, ప్రతి మనిషికి తన జీవితాన్ని ఇతరులకు నష్టం కలిగించకుండా జీవించే హక్కు వున్నది అని ఒప్పుకుంటారా? చలం గారి జీవితాన్ని ఆసాంతం చూస్తే, నాకైతే, ఆయన రమణ మహర్షిని ఆశ్రయించటం సరి అయిన ముగింపు అనిపిస్తుంది. రమణ మహర్షి ఒక గురువు. ఆయన ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్పేవారు-"నిన్ను నీవు తెలిసికో " అని. అద్వైత సిద్దాంతాన్ని పాటించి చూపిన వ్యక్తి. మహిమలు చూపి జనాలని ఆకర్షించ లేదు, కార్లలో, విమానాలలో తిరుగుతూ, A.C. గదులలో నివసించలేదు........ చలం జీవితం అంతా ఆడదాని గురించి ఆలోచించి, ఎన్నో పుస్తకాలు వ్రాసి,( అభిమానులని సంపాదించుకుని), ఆంధ్ర దేశం నుండి బహిష్కరణకి గురి అయి కనీసం చివరి రోజుల్లో అయినా తన గురించి తను ఆలోచించుకునే అవకాశం దొరికింది అని చలం అభిమానిగా అనుకుంటాను. "బుజ్జి గాడు, మిథునం " చదివారని, ఆనందించారని అనుకుంటూ ...

అనూరాధ బండ్లమూడి .
Anuradha Bandlamudi
 
Posts: 11
Joined: Tue May 15, 2012 7:33 pm

Re: చలం: ముఖాముఖీ

Postby arajam » Mon Sep 17, 2012 10:43 pm

నమస్తే అనురాధగారు.
బుజ్జిగాడు, మిథునం చదివాను. మీకు ఈమెయిలు పెట్టాను కూడా. నా దగ్గర మీ పుస్తకాలు ఉన్నాయి. మల్ల శనివారం దాక నేను వసుంధర గారిని కలవటం అవ్వదు. ఈ రోజు వచ్చి ఇచ్చేద్దాం అనుకున్న, కాని మీరు నా ఈమెయిలు చూడలేదు అనుకుంటా. manavmahi@hotmail.com మీదేనా? రేపు కూడా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తేగలను.
మిథునం పై అందరం చిన్న చర్చ పెడితే బావున్ను రాబోయే తెలుసున సదస్సులో. ఘడియారం లో పెద్ద ముళ్ళు రాలిపోయింది అన్న పోలిక నాకు చాల బాగా నచ్చింది.
--అరుణ్
-అరుణ్
arajam
 
Posts: 14
Joined: Wed Aug 15, 2012 10:21 pm
Location: Kew Gardens

Re: Oori chivari ILLU

Postby arajam » Sun Sep 30, 2012 1:08 pm

-అరుణ్
arajam
 
Posts: 14
Joined: Wed Aug 15, 2012 10:21 pm
Location: Kew Gardens

Re: చలం: ముఖాముఖీ

Postby subu » Fri Oct 05, 2012 9:44 pm

జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషి రమణ మహర్షి దరి చేరవలె
చలము గారు ఆలోచించు వారు కనుక గమ్యము తెలుసుకోనిరి
నన్ను నేను తెలుసుకొనవలెను, నీవు నీవే తెలుసుకొనుము అనిరి మహర్షి
చలము గారు అతిసున్నితముగా ఇతరులను తెలుసుకొని, చివరిన వారిని వారు తెలుసుకోనిరి


Please visit
http://www.arunachala.org/ashrama/new-york/
to know more about Ramana Maharshi and the books. Sorry for my attempt to digress

subu
subu
 
Posts: 117
Joined: Thu May 10, 2012 9:03 pm


Return to కథా సాహిత్యం

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron