by Anuradha Bandlamudi » Mon Sep 17, 2012 6:57 pm
నమస్కారం,
చివరికి మిగిలేది పిడికెడు బూడిదే కదా!
విషయానికి వస్తే, ప్రతి మనిషికి తన జీవితాన్ని ఇతరులకు నష్టం కలిగించకుండా జీవించే హక్కు వున్నది అని ఒప్పుకుంటారా? చలం గారి జీవితాన్ని ఆసాంతం చూస్తే, నాకైతే, ఆయన రమణ మహర్షిని ఆశ్రయించటం సరి అయిన ముగింపు అనిపిస్తుంది. రమణ మహర్షి ఒక గురువు. ఆయన ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్పేవారు-"నిన్ను నీవు తెలిసికో " అని. అద్వైత సిద్దాంతాన్ని పాటించి చూపిన వ్యక్తి. మహిమలు చూపి జనాలని ఆకర్షించ లేదు, కార్లలో, విమానాలలో తిరుగుతూ, A.C. గదులలో నివసించలేదు........ చలం జీవితం అంతా ఆడదాని గురించి ఆలోచించి, ఎన్నో పుస్తకాలు వ్రాసి,( అభిమానులని సంపాదించుకుని), ఆంధ్ర దేశం నుండి బహిష్కరణకి గురి అయి కనీసం చివరి రోజుల్లో అయినా తన గురించి తను ఆలోచించుకునే అవకాశం దొరికింది అని చలం అభిమానిగా అనుకుంటాను. "బుజ్జి గాడు, మిథునం " చదివారని, ఆనందించారని అనుకుంటూ ...
అనూరాధ బండ్లమూడి .