ఆది శంకరాచార్యుల వారి కలతవాక్యాలు:

చమత్కార/హాస్య వ్యాసాలు, పరిశోధనాత్మక/సందేశాత్మ/విమర్శాత్మక వ్యాసాలు .... అన్ని రకాల తెలుగు వ్యాస రచనలు - మీ స్వీయ రచనలు లేదా మీ అభిమాన వ్యాసరచయిత వ్యాసాలు (మీ వ్యాఖ్యానంతో), వాటి మీద చర్చలూ!

ఆది శంకరాచార్యుల వారి కలతవాక్యాలు:

Postby Dr.Rapelli_Sridhar » Sat Feb 24, 2018 3:58 pm

ఆది శంకరాచార్యుల వారి కలతవాక్యాలు:
"యేమిలేని జీవుడు వున్నాడు. అవిద్య వున్నది. ప్రకృతి వున్నది. ఆత్మ వున్నది. కారణం వున్నది. గుర్తెరిగే జ్ఞానం వున్నది. అజ్ఞానం లేదు. సచ్చిదానందం వున్నది. అసంజ్ఞతమః భాత్మకం జగత్. వొక్కటేగాని రెండోది యేమీలేదు. రెండోది శరీరం. శరీరమును గుర్తెరిగేది వున్నది. ఈశ్వరుడున్నాడు. ప్రకృతులు రెండు. ప్రకృతి యేమీ లేదు. పురుషుడు యేమీ లేదు. పురుషుడు నేను, ప్రకృతి యేమీ లేదు. జ్ఞానం ఏమీ చెయ్యదు. అది జడం. దేహం అబద్దం, దేహి నిబద్ది. జ్ఞాన సాన్నిధ్యం చేత శరీరం చేస్తుంది. గుర్తెరిగే జ్ఞానానికి వికారం లేదు. శరీరానికి అన్ని వికారాలు వున్నవి. జగత్తుకు గుర్తెరిగే బ్రహ్మము కారణము. శరీరము కార్యము. కార్యకారణాలకు భేదం లేదు. సువర్ణం అలంకారం యాలాగో ఆలాగే. ఆడదానివల్ల జగత్తు పుట్టింది. పురుషునికి స్త్రీ అనే ప్రకృతికి సంబంధం లేదు. బ్రహ్మమును నేను. వారి వారి కర్మాలచేత పుడుఛారు. కర్మాలకు కర్తలేడు, భోక్తలేడు. సర్వం ఆత్మే. సర్వం బ్రహ్మస్వరూపమే. జగత్తు లేదు. సార్వకాలం ఒక్కతీరే. సర్వం అహంకారమే చేస్తుంది. వేదాలు తమకు తామే స్వతః సిద్ధాలు. నేనే నేను. ఈ సంసారం కలవంటిది. జాగ్రతకద్దు. స్వప్నం కద్దు. సుషుప్తి కద్దు. తుర్యం కద్దు. ఈ శరీరంలో నే కనుక్కోవలెను. శరీరం లోపటలేదు, బయటలేదు. చిదాకాశం. జడాకాశం. గుర్తెరిగే క్షేత్రజ్ఞస్వరూపమనే ఆత్మవలననే ఆకాశం పుట్టింది. ఆత్మనః ఆకాశః సంభూతః. ఆకాశస్యగుణః శబ్దో నిశ్శబ్దోబ్రహ్మముచ్యతే. మాట్లాడేది సగుణమననా? నిర్గుణమననా? గుర్తెరిగే చైతన్యం బ్రహ్మ గనుక గుర్తెరిగే శరీరం మాట్లాడదు. యేనవా వాచమవ్యాకరోతి అని శ్రుతి వున్నది. గుర్తెరిగే చైతన్యం చేతనే మాట్లాడుఛాడు. గుర్తెరిగే నేను నిర్గుణం. గుర్తెరుగబడే శరీరాలు సగుణం. నిర్గుణం సగుణానికి కారణం. బ్రహ్మ జగత్కారణం అయితే కార్యాలు సగుణం. ఏలాగు అంటే అంతా నిర్గుణమే సగుణం లేనే లేదు" అని అన్నారు ఆది శంకరాచార్యుల వారు. ఇవన్నీ కలతవాక్యాలే తప్ప. వీటిలో సత్యం లేదు.
Dr.Rapelli_Sridhar
 
Posts: 129
Joined: Thu May 10, 2012 1:38 pm

Return to వ్యాస రచనలు

Who is online

Users browsing this forum: No registered users and 1 guest

cron