తనువులు శాశ్వితమా! తమకములు శాశ్వితమా! తాను, తన యను కొనే తపనలు శాశ్వితమా! ||తనువులు|| 1. నశ్వరము యీ జగము, నశ్వరము దేహము నశ్వరము నమ్ముకొన్న యీ మోహ బంధము, నశ్వరము మన శక్తి, నిగ్గు ఐశ్వర్యము, విశ్వమున యోచించ ఏది శాశ్వితమా! ||తనువులు|| 2. పదవులు, బిరుదులు, పదిమందిలో కీర్తి, ఎదిగిన అస్ధులు, ఎన్నేన్నో సంపదలు, ముదిరిన వయసులో మన్ను పాలేగాని ఏది యోచించిన యిచట శాశ్వితము ? ||తనువులు|| 3. వంచనలు, వేదనలు, వలపులు, విరహాలు, యో చించ జగతిన ఏది శాశ్వితము ? ఎంచ తిరుమల పతి ఏడు కొండల స్వామి, పంచన ఉన్నదే గాదే పటువుగ శాశ్వితము. ||తనువులు|| చాకలకొండ రమాకాంతరావు Thursday, June 28, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |