పూజింపరే హరిని పూజింపరే, తో యజ నేత్రుని తిరుమల వాసుని. || పూజింపరే|| 1. మనసు నిలకడ చేసి మాధవుని మ్రోక్కరే జనన మరణ సుడుల చక్కగా తేలరే, తనువు పై మమతలు తొలగించి చూడరే, అనువగా దరినున్న అలమేలు పతిని. || పూజింపరే|| 2. రామ రామ యనుచు రమ్యముగ పలుకరే, కామ క్రోధములనే కలుషములు కడగరే, తామసము తెగనరికి తత్వమును కొలవరే శ్యామల సుందరుని, సరసిజ పతిని. || పూజింపరే|| 3. నాణ్యమైన బుద్ది నేర్పుగా నేర్వరే, సు గుణములు మదిలోన సొంపుగ మలుపరే, ఫణి శయనుడు హరి ప్రహ్లాద వరదుని, శ రణము చేగోని సుఖములు బడయరే. || పూజింపరే|| రమాకాంతరావు చాకలకొండ June 24, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |