శేషాద్రిపై నడిగో శ్రీకాంతుడు, భూషణోపేతుడు భూకాంతుడు. ||శేషాద్రిపై|| 1. వజ్ర కిరీటపు వెలుగులు ఉప్పొంగ, భుజ కీర్తుల భూరి దీప్తులు పొసగంగ, నిజ వైభవ భూరి నిండారు శోభలతో, గజ రక్షకుడు యడుగో గోవిందుడు. ||శేషాద్రిపై|| 2. అలమేలు మంగమ్మ ఆగుండెపై వెలుగ, కలికి సిరి యీ వైపు కాంతులతో మెరయంగ, తెలుగు వారి యింట దీపమై నెలకొన్న, కుల దైవము అడుగో కలి వేంకటేశుడు. ||శేషాద్రిపై|| 3. మణిమయ దీప్తుల మాల మెడ ఒనరంగ ఫణి శయనుడు అడుగో ప్రభలేన్నో చిమ్మగ, కనక మయ భూషణుడు, కామితార్ధ దాయి కనుగొన అల్లడిగో కన్నల పండువగ. ||శేషాద్రిపై|| చాకలకొండ రమాకాంతరావు June 21 2oo7, Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |