యిది హృదయ రోగాలు తొలగించు వైద్యము, యిది మది మలినాలు కడుగు ఔషధము. ||యిది|| 1. యిది భవ సాగరము దాటించు యంత్రము, యిది వేద మంత్రముల యింపైన సారము, యిది గీత బోధించు గూఢమగు మార్గము, యిది తెల్సిన బ్రతుకు - బాటగు సుగమము. ||యిది|| 2. యిది పర సాధనకు పావన మంత్రము, యిది ఇహ సౌఖ్యములు అందించు తంత్రము, యిది మునులు సాధించు ఎకైక గమ్యము, యిది సత్యము, సుఖము, సతత నిర్మలము. ||యిది|| 3. యిది సర్వ జీవుల ఎకైక మూలము, యిది తొలుత నిండిన ఓంకార నాదము, యిదే అది, అంతము, అనంతము, శూన్యము, యిది విశ్వ గోళముకు భ్రమణ ఆధారము. ||యిది|| 4. యిది ప్రేమ సాకర సుందర రూపము, యిది కొల్చు భక్తులకు కొంగు బంగారము, యిది మధుర అమృత, మకరంద తుల్యము యిది వేంకటాపతి మధురమగు నామము. ||యిది|| చాకలకొండ రమాకాంతరావు May 20, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |