సాధింపరే ఘనులు సామర్ధ్యము పెంచి,ధ ర్మార్ధ కామములు ధరణిలో నెంచి. ||సాధింపరే|| 1. కామ, క్రోధములను కొన వరకు త్రుంచి, ప్రేమయను దివ్వెను పట్టి వెలిగించి, శమ, దమాదులతోటి శాంతి స్థాపించి,స్వ ర్గముగ భువిలోనే సమత స్థాపించి. ||సాధింపరే|| 2. కర్తవ్య సాధనే క్రియలోన పెంచి, భార్తు భావమే భువిన బాగ సాధించి, ఆర్ధము, ఙ్ఞానము అందరికి పంచి, ని స్వార్ధ భావనే జగతిలో పెంచి. ||సాధింపరే|| 3. కమ్మని ప్రేమనే కలయ సాధించి, నెమ్మిగ నెయ్యము అందరికి పంచి, యిమ్ముగ జన్మము యిలన సాధించి కొమ్మ మంగ పతి మెచ్చు భక్తుడిగ. ||సాధింపరే|| రమాకాంతరావు చాకలకొండ May 18 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |