పల్లవి. కంటిని కేశవుని, కమల సంభవుని, ము క్కంటి రూపుడగు మా వేంకటేశుని. ||కంటిని|| అనుపల్లవి. కంటి సృష్టి, స్ధితి ప్రళయ కారకుని, కంటి త్రైమూర్తి యగు తిరుమల నాధుని. ||కంటిని|| 1. అండజ, క్షీరజ, అవని, జల, గగన చర, బ్ర హ్మాండ భాండముల నుండు ప్రాణుల గన్న, మెండు సృష్టికి మూల కారణ కారిని నిండుగ కంటిని నేడు శ్రీపతిని ||కంటిని|| 2. జనని జనకుని రూపు జగతికే తానై, క మ్మని ప్రేమను కడుపార పంచి, అన్న పానములను అందరికి అందించు అన్న దాత మా వేంకటపతిని. ||కంటిని|| 3. రోగములు, రొప్పులు, బాధలతో నలుగుచు జగములో ఎన్నెన్నో వేదనలు చెందెడి, భగము దేహము గొని కొత్తది అందించు శంకరుని శ్రీకరుని శ్రీ శ్రీనివాసుని. ||కంటిని|| చాకలకొండ రమాకాంతరావు May 15, 2007 Cincinnati OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |