కావు యివి కన్నులకు కల్గిన రోగములు, ఏవేవో జన్మల దుష్కర్మ ఫలములు.. || కావు యివి|| 1. ఆడి తప్పితినేమో ? అంధకారము కమ్మె, పైడి దోచితినేమో ? పాపములు చుట్టె, వాడి మాటలతోటి వేధించితిని యేమో ? మోడుగ మారినది యీ బ్రతుకు నేడు! || కావు యివి|| 2. చెడు పనులు చేసితినో ?చేతులు చితికినవి, పాడు మాటాడితినో? పడిపోయె నోరు, దాడి చేసితినేమో ? తెగిపోయె పాదములు పాడిగ యిటు కల్గె పాపముల ఫలము! || కావు యివి|| 3. ఆడు వారిపైన అకృత్య ఫలితమో ఆడకుండ పోయె అన్ని అంగములు, వేడ వేంకటపతే వన్నెగ నాతోడు ఏడ పోయిన యింక తీరునా చేడు. || కావు యివి|| చాకలకొండ రమాకాంతరావు July 5, 2007 Cincinnati, OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |