Creative works from Telusuna Members

జవరాండ్ల చూపుల చల్లని నీడలో, సేదగొను నా స్వామి శ్రీనివాస!

రమాకాంతరావు చాకలకొండ

జవరాండ్ల చూపుల చల్లని నీడలో, సేదగొను నా స్వామి శ్రీనివాస! ని
లువ నీడ లేని నా బోటి వారలకు, నిలువెత్తు నీడైన వేంకటేశ! ||జవ||

1. కోమలాంగులు జూచు కలువ కన్నుల వాడ,
కమ్మని నా స్వామి శ్రీనివాస!
నమ్మి కొల్చెడి మమ్ము నెమ్మిగ జూచెడి
యిమ్మైన నాస్వామి వేంకటేశ! ||జవ||

2. వజ్రకిరీటపు వైభవంబుల వెలయు
వరద! వేంకటరాయ! శ్రీనివాస!
నిజ భక్త భూషణ, ప్రేమ కరుణా వ్రత!
నారాయణ! హరే! వేంకటేశ! ||జవ||

3. మంగ, పద్మావతుల కను సన్నల మెలగు
మాధవ! మాస్వామి శ్రీనివాస!
సింగారము జూపి, మా సేవ గైకొని
కనుపాపగ గాచు వేంకటేశ! ||జవ||

రమాకాంతరావు చాకలకొండ
July 8, 2007 Cincinnati OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list