న్యాయము చేయుము నారాయణా! దయగొని మాపై దీనావనా! ||న్యాయము|| 1. దీనుల పాలిటి దిక్కువు నీవని, ఆ పన్నులకు ఆత్మ బంధువని, వీనుల విందుగ వింటిమి కధలు, పన్నగ శయన చూపుము కృపలు. ||న్యాయము|| 2. దానవ మద గజ దమన సింగమా, మానవ జాతికి మేటి కవచమా, కానగ జూపుము కన నీ ప్రభలు వినవయ్యా యిక దీనుని మొరలు. ||న్యాయము|| 3. దుర్మార్గులగు దైత్యుల బట్టి, సరియగు రీతిన శాస్తిని చేసి, నారసింహ యిక చూపుము దయలు, దరి చేరి యిక తీర్చుము వగలు. ||న్యాయము|| చాకలకొండ రమాకాంతరావు July 28, 2007 |
#maa telugu talliki mallepU daMDaa# |