"మాసానాం మార్గశీర్షోహం" దుర్గాప్రసాదు వారణాసి (19 నవంబరు 2007) "మాసములను నేను మార్గశీర్ష" మనుచు పార్ఠసారధీవు పలికి నావు! మార్గశీర్షమందు మాయమ్మ కనినంత ధన్యతముడ నైతి ధరణి నేను మార్గశీర్ష కృష్ణ పక్ష చతుర్దశీ ఉదయ కాల మందు నుద్భవించి తల్లి తండ్రి గురులు నెల్ల వేళల గాంచ ధన్యతముడ నైతి ధరణి నేను కనక దుర్గమ్మ నన్నునా జనని కొసగ ఆంధ్ర భూమాత తల్లియై ఆదరింప తిరుమలేశుండు నొజ్జయై తెరువు నేర్ప ధన్యతముడనైతిని నేడు ధరణి నేను ఎన్ని జన్మాల పుణ్యంబు నిట్టి పగిది పుడమి జన్మించు సద్భాగ్య మొందితేను సార్ధకంబిల నాదైన జన్మమనగ ధన్యతముడ నైతిని దివ్య ధరణి నేను |
#"mAsAnAm mArgaSIrshOham" durgAprasAdu vAraNAsi (19 navambaru 2007) "mAsamulanu nEnu mArgaSIrsha" manucu pArThasAradhIvu paliki nAvu! mArgaSIrshamamdu mAyamma kaninamta dhanyatamuDa neiti dharaNi nEnu mArgaSIrsha kRshNa paksha caturdaSI udaya kAla mamdu nudbhavimci talli tamDri gurulu nella vELala gAmca dhanyatamuDa neiti dharaNi nEnu kanaka durgamma nannunA janani kosaga Amdhra bhoomAta talliyei Adarimpa tirumalESumDu nojjayei teruvu nErpa dhanyatamuDaneitini nEDu dharaNi nEnu enni janmAla puNyambu niTTi pagidi puDami janmimcu sadbhAgya momditEnu sArdhakambila nAdeina janmamanaga dhanyatamuDa neitini divya dharaNi nEnu# |