పదహారేళ్ళ ప్రాయం అద్దంలా స్వచ్చమైన కన్నె పరువం నిశ్చలంగా, నిశ్శంబ్దంలా తటాకపు గట్టు మీద వాకంలా నిర్నిమేషంగా అలజడి రేపు తనువులా అలలు రేపుతూ పడుతున్న జ్ఞాపకాల కెరటాలలా గాలిలో తేలుతూ, మంచులో కరుగుతో ఆంతలొనే నగిషీ కరించుకొంటూ తిరిగి మంచుపూల బాష్పంగా మారుతూ సిగ్గు పడుతూ, బిడియంతో పలకరిస్తూ కిల కిల రాగంగా సవ్వళ్ళు చేస్తూ పిల్ల గాలి తెల్ల మబ్బుల పూల గుచ్చంలా కురిసే వానలో, మెరిసే మెరుపులా ఉరకలేస్తూ వొళ్ళు విరుచుకున్న తనువు ఏవేవో వినూత్న స్పందనములు రేపు మనసు ఆందమైన రంగుల హరివిల్లు లాంటి వయసు ఆరవిరిసిన మందారంలా పూచిన తొలి వలపు మళ్ళీ జీవితాన విరిస్తే యెంత బాగుండు….! చిత్రకార్ |
#padahaarELLa praayam addamlaa swacchamaina kanne paruvam niSchalamgaa, niSSambdamlaa taTaakapu gaTTu miida vaakamlaa nirnimEshamgaa alajaDi rEpu tanuvulaa alalu rEputuu paDutunna jnaapakaala keraTaalalaa gaalilO tElutuu, manculO karugutO AntalonE nagishii karimcukonTuu tirigi mancupuula baashpamgaa maarutuu siggu paDutuu, biDiyamtO palakaristuu kila kila raagamgaa savvaLLu cEstuu pilla gaali tella mabbula puula gucchamlaa kurisE vaanalO, merisE merupulaa urakalEstuu voLLu virucukunna tanuvu EvEvO vinuutna spandanamulu rEpu manasu Amdamaina ramgula harivillu laamTi vayasu aravirisina mamdaaramlaa puucina toli valapu maLLii jiivitaana viristE yenta baagunDu….! citrakaar |