నూతన వర్షోత్సవ దినం దుర్గాప్రసాదు వారణాసి (1 జనవరి 2008) దేవగన్నేరు పుష్పమీ దీవులందు దివ్య సౌగంధ వీచికల్ దిశల నంప తన్మయంబున సుస్వాగతంబు బల్కు ద్వీపవాసుండ నేనయ్య దినకరుండ! నూతన వత్సరోత్సవ వినోద విలాస విహార వేళలన్ భూతలవాసులందరును భోగ కలాపములందు తేలుచున్ సేతురహో ప్రతిజ్ఞలవి సేయగ నెంచని భావమందు సం ధాత రమాపతిన్ గొలిచి ధాత్రికి శాంతిని గూర్చ నెంతురే! నిన్న సంవత్సరాంతమనియుచు నెంచి నేడు సంవత్సరాదియనియు గణించి మోహమూర్చత నొందెడి మూఢులైన మనల దిలకించి నవ్వేను దినకరుండు! నిన్నటిదగుఋణంబెల్ల నేడు మిగుల నిన్న నేడన్న భేదంబు నిజము గాదు. నిన్నయే నేడుగాన్ నేడు నిన్న గాదె? ఎటుల సంభవ మీక్రొత్త నేడనంగ? దినకరుని దరిజేరేటి దినమనంగ నది డిసెంబరు నెలలోన నవధరించు జనవరిన్ మొదటి దినము సంవత్సరపు ప్రధమ దినము గాబోదురా పృధివి కెపుడు! |
#nUtana varshOtsava dinam durgAprasAdu vAraNAsi (1 janavari 2008) dEvagannEru pushpamI dIvulamdu divya sowgamdha vIcikal diSala nampa tanmayambuna suswAgatambu balku dvIpavAsumDa nEnayya dinakarumDa! nUtana vatsarOtsava vinOda vilAsa vihAra vELalan bhUtalavAsulamdarunu bhOga kalApamulamdu tElucun sEturahO pratijnalavi sEyaga nemcani bhAvamamdu sam dhAta ramApatin golici dhAtriki SAmtini goorca nemturE! ninna samvatsarAmtamaniyucu nemci nEDu samvatsarAdiyaniyu gaNimci mOhamUrcata nomdeDi mUDhuleina manala dilakimci navvEnu dinakarumDu! ninnaTidaguRNambella nEDu migula ninna nEDanna bhEdambu nijamu gAdu. ninnayE nEDugAn nEDu ninna gAde? eTula sambhava mIkrotta nEDanamga? dinakaruni darijErETi dinamanamga nadi Disembaru nelalOna navadharimcu janavarin modaTi dinamu samvatsarapu pradhama dinamu gAbOdurA pRdhivi kepuDu!# |