మాతృ, పితృ, గురు, హిత, దేవోభవ! దుర్గాప్రసాదు వారణాసి (31 డిసెంబరు 2007) సూర్య భగవాను కిరణాలు సోకినంత నమల కమలంబు వికసించు నటుల నేను నరహితుని కరుణా సరోవరము నందు జలక మాడంగ గాంక్షించు జలజ మేను! చందమామ సుఖమొసంగు చంద మందు అమ్మ నయనాల కనిపించె డాదరమ్ము పిల్ల వాయువు గొనితెచ్చు చల్ల దనము వెరసి వేంకటేశుండిచ్చు వరమదయ్య! తల్లి తండ్రులు మనకిచ్చె తనువనంగ గురుడు మనకిచ్చె సుజ్ఞ్యాన తరువనంగ హితుడు మనకొసంగె నమూల్య హితమనంగ తిరుమలేశుండు వారెల్ల తెలుగు వాడ! |
#mAtR, pitR, guru, hita, dEvObhava! durgAprasAdu vAraNAsi (31 Disembaru 2007) sUrya bhagavAnu kiraNAlu sOkinamta namala kamalambu vikasimcu naTula nEnu narahituni karuNA sarOvaramu namdu jalaka mADamga gAmkshimcu jalaja mEnu! chamdamAma sukhamosamgu chanda mamdu amma nayanAla kanipimce DAdarammu pilla vAyuvu goniteccu challa danamu verasi vEnkaTESumDiccu varamadayya! talli tamDrulu manakicce tanuvanamga guruDu manakicce sujnyAna taruvanamga hituDu manakosamge namUlya hitamanamga tirumalESumDu vArella telugu vADa! # # |