శ్రీనివాస శతకం దుర్గాప్రసాదు వారణాసి [ఉపోద్ఘాతము: “శ్రీనివాస” మకుటముతో తెలుగు భాషలో శతక రచనకు సీసము, ఆటవెలది, మరియు తేటగీతి చందస్సు సరిపోతుంది. ఆ పద్యముల ప్రయోగించి ఈ శతకరచనకు సాహసించితిని.] ఆ.వె.: శ్రీనివాస! నిన్ను చేతమందుననిల్పి సృష్టి వంక నాదు దృష్టి జూపి ఎల్ల లోక సరళి నెరుగ గోరెడి నాకు తెలుపుమో రమేశ! తిరుమలేశ! సీ.: రవి గాంచనిదియెల్ల కవి గాంచునని దెల్ప రచియింతు నేనీ ప్రవచనములను మస్తిష్క మందిరంబందులో స్పురియించు మానవ ధర్మంబు మనవి సేతు కమలాక్షుడిచ్చిన కనులార గాంచిన పుడమి పోకడ నెల్ల నుడివె దిచట పార్థసారథి నేర్పు పాఠంబు లవియెల్ల పాఠక పంక్తితో పంచు కొనెద ఆ.వె.: అనుచు శతక మిపుడు ఆంధ్రమ్ములో వ్రాయ సాహసమ్ము జూపు సత్కవినన నిండు కవిత కలము నుండి ధారగ జార తెలుపుమో రమేశ! తిరుమలేశ! భర్తృహరిని గాను కార్తికేయుడ గాను నీతి శాస్త్ర మిలను నేర్ప నెంచ తోచెడూహలన్ని తూచి తెల్పుట నాకు తెలుపుమో రమేశ! తిరుమలేశ! “విశ్వధాభిరామ వినుర వేమ!” యనెడు మకుట మందు శతక మవని నుండ "నీతి నేర్ప నెంచ నేనెవ్వడను స్వామి?" తెలుపుమో రమేశ! తిరుమలేశ! తెలుగు నందున్ సుమతీ శతకంబది తెలుగు వారి కెల్ల తెలివొసంగ నీతి శతకమిపుడు నేవ్రాయనేలంచు తెలుపుమో రమేశ! తిరుమలేశ! ఆవు కున్న యట్టి ఆదర్శ జీవాత్మ అన్యులకును లేదు అవని జూడ నిన్ను జేరె డాత్మ నిస్వార్ధ మనియంచు తెలుపుమో రమేశ! తిరుమలేశ! తల్లి తండ్రు లొసగ తనువు నీ ధాత్రిలోన్ గురువు జూపు బ్రతుకు తెరువు మాకు ధరణి తల్లి తండ్రి గురువు నీవని మాకు తెలుపుమో రమేశ! తిరుమలేశ! పార్థసారథీ! అపారకృపానిధీ! గురువు లెల్లరకును గురువు వీవు పార్థుడనని యెంచి పాఠంబు నేర్పంగ తెలుపుమో రమేశ! తిరుమలేశ! తే.గీ.: తృష్ణ లన్నియు దీర్చు శ్రీకృష్ణమూర్తి! పార్ఠసారఠివై మాకు పాఠములను బోధ జేసెడి గురుపుంగవుండవనుచు తెలుపుము రమేశ! పరమేశ! తిరుమలేశ! (సశేషం) |
#SrInivAsa Satakam durgAprasAdu vAraNAsi [upOdghAtamu: “SrInivAsa” makuTamutO telugu bhAshalO Sataka racanaku sIsamu, ATaveladi, mariyu tETagIti chandassu saripOtundi. A padyamula prayOgimci I Satakaracanaku sAhasimcitini.] A.ve.: SrInivAsa! ninnu cEtamamdunanilpi sRshTi vamka nAdu dRshTi joopi ella lOka saraLi neruga gOreDi nAku telupumO ramESa! tirumalESa! sI.: ravi gAmcanidiyella kavi gAmcunani delpa raciyimtu nEnI pravacanamulanu mastishka mamdirambamdulO spuriyimcu mAnava dharmambu manavi sEtu kamalAkshuDiccina kanulAra gAmcina puDami pOkaDa nella nuDive dicaTa pArthasArathi nErpu pAThambu laviyella pAThaka pamktitO pamcu koneda A.ve.: anucu Sataka mipuDu AndhrammulO vrAya sAhasammu joopu satkavinana nimDu kavita kalamu numDi dhAraga jAra telupumO ramESa! tirumalESa! bhartRharini gAnu kArtikEyuDa gAnu nIti SAstra milanu nErpa nemca tOceDUhalanni tooci telpuTa nAku telupumO ramESa! tirumalESa! “viSvadhAbhirAma vinura vEma!” yaneDu makuTa mamdu Sataka mavani numDa "nIti nErpa nemca nEnevvaDanu swAmi?" telupumO ramESa! tirumalESa! telugu namdun sumatI Satakambadi telugu vAri kella telivosamga nIti SatakamipuDu nEvrAyanElamcu telupumO ramESa! tirumalESa! Avu kunna yaTTi AdarSa jIvAtma anyulakunu lEdu avani jooDa ninnu jEre DAtma niswArdha maniyamcu telupumO ramESa! tirumalESa! talli tamDru losaga tanuvu nI dhAtrilOn guruvu joopu bratuku teruvu mAku dharaNi talli tamDri guruvu nIvani mAku telupumO ramESa! tirumalESa! pArthasArathI! apArakRpAnidhI! guruvu lellarakunu guruvu vIvu pArthuDanani yemci pAThambu nErpamga telupumO ramESa! tirumalESa! tE.gI.: tRshNa lanniyu dIrcu SrIkRshNamoorti! pArThasAraThivei mAku pAThamulanu bOdha jEseDi gurupungavumDavanucu telupumu ramESa! paramESa! tirumalESa! (saSEsham)# |