కోపము సమకూరు కార్యములు చెఱచును , కోపము తాపమై కలతలు తెచ్చును. ||కోపము|| 1. కోపము బంధువుల కలహములు తెచ్చును, కోపము మైత్రిని కసిగ చెడ మార్చును, కోపము నెయ్యమును కయ్యముగ మార్చును, కోపమున్న వ్యక్తి కడకగు హీనము. ||కోపము|| 2. కోపము బుద్ధిని మందము చేయును, కోపము ఙ్ఞానమును కనుమరుగు చేయును, కోపము గుండెను కస కస త్రెంచును, కోపముతో కార్యములు సాధింప జాలము. ||కోపము|| 3. కోపము జీవుని కృంగింప జేయును, కోపము కల్గిన, మరుగును రుధిరము, కోపముతో వడియగు రక్తప్రవాహము, కోపముతో కల్గును మేనుపై తాపము. ||కోపము|| 4. కోపమొదిలిన వ్యక్తి దైవ సమానము కోపము తగ్గించ పెంచుము సహనము, కోపముతో శ్రీహరి అగు నీకు దూరము, కోపమును ప్రేమగ కొనవరకు మార్చుము. ||కోపము|| రమాకాంతరావు చాకలకొండ March 5, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |