పల్లవి. రాము డెవరయా ? శ్రీ రాము డెవరయా ? శ్యాముడు, రఘు రాముడు, పుట్టని వాడా ? ||రాము|| అనుపల్లవి. అందరూ నుతి చేయు ఆనంద రాముడు, సుందరుడు, శ్రీకరుడు లేనే లేడా? ||రాము|| 1. సింధువుపై సేతువు నిర్మించని వాడా? అందరి ప్రియదైవము లేనే లేడా? ఇందిర రమణుడు, ఇనకుల సోముడు, ఆత్మ రాముడు అసలు లేనే లేడా ? ||రాము|| 2. కార్య దీక్షలో కరకు నొందిన వాడు, శూరుడు, శ్రీ రాముడు సృష్టిలోనే లేడా? నరులలో నియతి ఉన్న ఒకే ఒక పురుషుడు, శ్రీరాముని - యునికి మరుచుట పాడా? ||రాము|| 3. కందువగ మీ ఎదలో పరికించరేమయా? హిందువులూ! మీ గుండెలు మరగుట లేదేమయా? డెందములో ఆవేశము పొంగులు కాదేమయా? అందరూ తమ మదిలోన అలోచన చేయరయా? ||రాము|| ఆమెరికా కోకిల Tuesday, March 11, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |