తెలుసు కొన రయ్యా! తత్వము తెలుసు కొన రయ్యా! తెలుసు కొని మీ జీవితాలు, తరియింప జేయ రయ్యా! ||తెలుసు|| 1. పంచ రంగుల రామ చిలుకు, పంచ ధాతు పంజరాన, సంచితపు సంకెళ్ళ చిక్కి, సంతాప మొందెడి సుప్తి గతిని. ||తెలుసు|| 2. ఆలు,బిడ్డలే సర్వ మనుకొని, అరు మందిని మిత్రులను కొని, కాలుని గాలాన చిక్కి, కృంగి పోయెడి కలుష రీతిని. ||తెలుసు|| 3. మనసు నెంతో చంపుకొనుచు, మమత, ప్రేమలు త్రుంచు కొనుచు, మనిషి మోహమాయ అడసున, మునిగి పోయెడి అధోగతిని. ||తెలుసు|| 4. కాంత, కనకపు లాలసందు, కన్నుగానని జీవి చివరకు, శ్రీ కాంతుడు, శ్రీ వేంకటేశుని, శరణు గోరక, సుస్తి నొందును. ||తెలుసు|| రమాకాంతరావు చాకలకొండ February 19, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |