పలుకవే ప్రతి క్షణము ప్రేమతో హరి యని, కలువ నాభుని నుతిలో కమ్మగ మనసా! ||పలుకవే|| 1. సరిగమలు సొంపుగ సరసులై పారగ, స్వరములో రాగములు సృతితోటి పొంగగ, శారదాంబ వీణ సొగసుగా మీటగ, కరిరాజ వరదుని కీర్తనలు చేయవే. ||పలుకవే|| 2. గిరి రాజ మనుమడు గంటమును పట్టగ, వఱదలై కవితలు వే వేలు వెలయగ, తఱగని భావలు తత్వమును తెలుపగ, గిరి ధారి కీర్తనలు గొప్పగా చేయవే. ||పలుకవే|| 3. సిరి నాధుడే దయతో సరసతను కూర్చగ, వైరాగ్య గానముల వెల్లువలు నిండగ, వర వేంకటాపతి వద్ద మది చేరగ, తిరుమల గీతములు తియ్యగా పాడవే. ||పలుకవే|| రమాకాంతరావు చాకలకొండ January 2, 2008 |
#maa telugu talliki mallepU daMDaa# |